రిషబ్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో డబ్ అయ్యి అద్బుతమైన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా షార్ట్ 2 డేస్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డే లో మరోసారి రిమార్కబుల్ హోల్డ్ ని చూపించగా కలెక్షన్స్ ఆల్ మోస్ట్ డే 1 రేంజ్ లో….
సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 4వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయినా కానీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ నే చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం, మూడో రోజుతో పోల్చితే 35% రేంజ్ లో డ్రాప్ అయినా కానీ…
ఈవినింగ్ షోల టైం నుండి మంచి ట్రెండ్ ని చూపిస్తున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
లెక్క ఇంకొంచం పెరిగి 1.4 కోట్ల నుండి 1.5 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ చాన్స్ కూడా ఉంది, ఈ రేంజ్ లో వర్కింగ్ డేస్ లో కూడా సినిమా హోల్డ్ చేయడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.