యంగ్ హీరో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రణరంగం, మంచి అంచనాల నడుమ స్వాతంత్ర్య దినోత్సవం వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి యావరేజ్ టాక్ లభించగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా కుమ్మేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 3.8 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా 4.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపిన ఈ సినిమా తర్వాత మాత్రం స్లో డౌన్ అయింది.
వీకెండ్ ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర 9.3 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న ఈ సినిమా 5 వ రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా అక్కడ మరింత స్లో అయింది, మొత్తం మీద 5 వ రోజున సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 35 లక్షల షేర్ ని…
వరల్డ్ వైడ్ గా 40 లక్షల షేర్ ని వసూల్ చేసింది. దాంతో ఓవరాల్ గా 5 రోజులు ముగిసే సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 8.84 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 9.72 కోట్ల వరకు షేర్ ని అందుకుంది, టోటల్ గ్రాస్ 17.02 కోట్ల దాకా ఉంది.
కానీ సినిమా ను టోటల్ గా 16 కోట్లకు అమ్మగా 17 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని పక్కకు పెడితే ఇక మీదట మొత్తం మీద 7.28 కోట్ల వరకు షేర్ ని అందుకుంటే కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ సోమవారం హోల్డ్ చేసిన…
తీరు చూస్తె మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 12 కోట్ల లోపే పరుగును ముగించే అవకాశం ఎక్కువగా ఉందని అనిపిస్తుంది, మరి ఏదైనా అద్బుతం జరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర అంతకుమించి కలెక్షన్స్ ని సినిమా రాబట్టగలుగుతుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.