టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత బాక్ టు బాక్ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపగా, తన అప్ కమింగ్ మూవీస్ విషయం లో కూడా తన స్పీడ్ ని చూపెడుతూ దూసుకు పోతున్నాడు. కానీ ఇక్కడ కమిట్ అవుతున్న సినిమాలు మాత్రం ఫ్యాన్స్ కి కొంచం షాక్ ఇస్తున్నా మెగాస్టార్ పేరు మీదే కదా సినిమాలు ఆడేవి అని ఆశగా ఆ సినిమా ల కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించబోతుండగా వినాయక్ చేసే మార్పులు అంతగా నచ్చక పొతే బాబీ డైరెక్షన్ లో సినిమా ముందుకు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక ఈ రెండు సినిమాల లో ఆగిపోయిన సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. వీటి తర్వాత సినిమా ను కూడా ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫాం చేసేశాడు మెగాస్టార్ చిరంజీవి. బాక్స్ ఆఫీస్ దగ్గర 5 ఏళ్ల క్రితం ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండా టీసర్ తోనే రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన…
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వేదాలం సినిమా తెలుగు రీమేక్ ని మెగాస్టార్ మరోసారి లేటెస్ట్ గా తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో డిస్కస్ చేశారట చిరంజీవి. ఈ కథని ముందు ఎన్టీఆర్, తర్వాత పవన్ కళ్యాణ్ రిజక్ట్ చేయగా.. 5 ఏళ్లుగా సినిమా రీమేక్ అలాగే పెండింగ్ లో నే ఉండిపోయింది. కాగా ఇప్పుడు అఫీషియల్ గా సినిమా తెలుగు రీమేక్…
మెగాస్టార్ తో అవ్వబోతుందని సమాచారం. ఉన్న కథని డైరెక్ట్ గా తీయకుండా కథ పాయింట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉందట. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా పై మెగాస్టార్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు అని అంటున్నారు.