టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ కొత్తేమి కాదు, సినిమా కి వచ్చే కలెక్షన్స్ ఒకటి, ప్రొడ్యూసర్స్ పోస్టర్స్ లో చూపెట్టే కలెక్షన్స్ ఒకేటి…. రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడున్న నిర్మాతలు సినిమాల పోస్టర్ ల మీద మేం కలెక్షన్స్ ఎక్కువగా చూపెట్టేది జనాలను మోసం చేసి ఇంతలా కలెక్ట్ చేసిన సినిమాను మేం మిస్ అవ్వకూడదు అనుకుని థియేటర్స్ కి వచ్చి సినిమా చూడటానికి అంటూ ఓపెన్ గానే చెప్పారు.
ఈ మాటలు సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అవ్వగా హీరోల ఫ్యాన్స్ తమ పోస్టర్స్ గురించి కాకుండా పక్క హీరోల సినిమాల పోస్టర్ లు ఫేక్ అంటూ తెగ రచ్చ చేశారు, కానీ తమ సినిమాలకు వచ్చే సరికి మాత్రం ఆ పోస్టర్ లో ఉన్న లెక్కలే నిజం అని నమ్ముతారు.
ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఉప్పెన సినిమా 100 కోట్ల గ్రాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమా 100 కోట్లు దాటకపోయినా దాటినట్లు చూపెట్టి జనాలను మోసం చేశారు, ఇప్పుడు ఆడియన్స్ ను బాగా అక్కట్టుకుంటూ దూసుకు పోతున్న లవ్ స్టొరీ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.
సినిమా 4 రోజుల్లో 44 కోట్ల కి పైగా గ్రాస్ ని అందుకుంటే మేకర్స్ 3 రోజులకే వరల్డ్ వైడ్ గా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి అంటూ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ తమ హీరో సినిమా కలెక్షన్స్ ఎక్కువ వస్తే అందరూ తక్కువ చేసి చెబుతున్నారు అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. కానీ దాదాపు అన్ని బాక్స్ ఆఫీస్…
ట్రాకింగ్ సైట్స్ లో కూడా సినిమా 3 రోజుల్లో 37 నుండి 38 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ ఉన్నాయి… ఇలా ఫేక్ పోస్టర్ లతో ఒకప్పుడు పబ్లిసిటీ జరిగేది ఏమో కానీ ఇప్పుడు నిర్మాతలే ఓపెన్ గా మేం ఫేక్ పోస్టర్స్ వేస్తామని చెప్పినా మళ్ళీ మళ్ళీ జనాలు మోసపోతూ ఉండటం విడ్డూరం అనే చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో ఇలాంటి ఫేక్ పోస్టర్ లు ఎన్ని వస్తాయో చూడాలి.