బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో తెలుగు లో 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా అందులో ఒకటి ఆల్ మోస్ట్ మీడియం టు హై బడ్జెట్ తోనే తెరకెక్కిన సినిమా కాగా మరోటి ఆ సినిమాతో పోల్చితే ఆల్ మోస్ట్ నాలుగో వంతు బడ్జెట్ తో…
తెరకెక్కిన సినిమా… అవే వరుణ్ తేజ్(Varun Tej) నటించిన గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna) కాగా మరోటి కార్తికేయ(Karthikeya) హీరోగా నటించిన బెదురులంక2012(Bedurulanka2012) సినిమా… ఈ రెండు సినిమాలు ఈ వీకెండ్ లో టాలీవుడ్ తరుపున…
నోటబుల్ బిగ్ రిలీజ్ కాగా రెండు సినిమాల బడ్జెట్ లు, బిజినెస్ లు రిలీజ్ లు వేరు, కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 2 రోజుల్లో బెదురులంక2012 సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.73 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా….
గాండీవధారి అర్జున సినిమా మాత్రం 2 రోజుల్లో 98 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకుని నిరాశ పరిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాల బిజినెస్ లు వేరు కాగా గాండీవధారి అర్జున సినిమా ట్రేడ్ లెక్కల్లో 50 కోట్లకు అటూ ఇటూగా బడ్జెట్ తో తెరకెక్కగా…
బెదురులంక సినిమా ట్రేడ్ లెక్కల్లో 12 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కింది… ఆల్ మోస్ట్ బెదురులంకతో పోల్చితే 4 రెట్లు ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన గాండీవధారి అర్జున సినిమాను ఈజీగా ఓడించి బెదురులంక2012 సినిమా ఈ వీకెండ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…