బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో ముగించదానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుండగా మరో సారి సినిమా 3వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఇప్పుడు మరోసారి 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలు మరియు కర్ణాటక కలిపి మొత్తం మీద 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక హిందీ లో ఆల్ మోస్ట్ రెండో రోజు రేంజ్ లో…
హోల్డ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతున్న సినిమా ఆల్ మోస్ట్ ఈ రోజు 54 కోట్ల నుండి 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక తమిళనాడు కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలు కలిపి 14 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
టోటల్ గా ఇండియా లో మరోసారి 100 కోట్ల మార్క్ ని అందుకోబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి మినిమమ్ 110 కోట్ల మార్క్ గ్రాస్ కలెక్షన్స్ ని 4వ రోజు ఓవరాల్ గా సొంతం చేసుకోబోతుంది. దాంతో సినిమా ఈ కలెక్షన్స్ తో మొత్తం మీద ఇప్పుడు 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 520 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…..
ఓవర్సీస్ కలెక్షన్స్ వీకెండ్ తర్వాత క్లియర్ గా అప్ డేట్ అవుతాయి కాబట్టి ఆ కలెక్షన్స్ తో కలిపి సినిమా 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు 525 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం మించే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎక్స్ లెంట్ హోల్డ్ తో ఫస్ట్ వీకెండ్ ని రిమర్కబుల్ కలెక్షన్స్ తో ముగించబోతున్న కేజిఎఫ్ 2 సినిమా వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.