నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్ టు బాక్ 3 డిసాస్టర్ సినిమాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్నాడు. సింహా లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబో లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ మూడో రోజు కూడా ఊహ కందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమా మొదటి రోజు 29.5 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయగా రెండో రోజులు పూర్తీ అయ్యే టైం కి 43.5 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు సినిమా మూడో రోజు కూడా మెంటల్ మాస్ అనిపించేలా కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
సినిమా ఒక్క నైజాం ఏరియాలోనే ఈ రోజు 3.5 కోట్ల నుండి 4 కోట్ల మధ్యలో గ్రాస్ ని అందుకునేలా ఉండగా సీడెడ్ ఏరియాలో 2.6 కోట్ల నుండి 3 కోట్ల మధ్యలో గ్రాస్ ను సాధించే అవకాశం ఉంది, ఇక టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు అవలీలగా…
11 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు 12 కోట్ల కు చేరుకువే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 3 వ రోజు 12 కోట్ల నుండి 12.5 కోట్ల గ్రాస్ ను అందుకోవచ్చు. ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా….
55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది, ఆ లెక్క ఇంకా ముందుకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పాలి. మొత్తం మీద సినిమా మొదటి మూడు రోజులను అఖండమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపిన అఖండ 4 వ రోజు జోరు మరింత సాలిడ్ గా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆ రచ్చ ఏ లెవల్ లో ఉంటుందో చూడాలి ఇక.