Home న్యూస్ టాలీవుడ్ కి ఊపిరి పోసిన అఖండ…ఇక కాచుకోండి!

టాలీవుడ్ కి ఊపిరి పోసిన అఖండ…ఇక కాచుకోండి!

1648
0

ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అయ్యాయి… సంక్రాంతి నుండి సమ్మర్ వరకు చిన్న పెద్ద అని వరుస సినిమాలు రాగా సమ్మర్ టైం లో ఆంధ్ర లో టికెట్ రేట్లు తగ్గించడం వకీల్ సాబ్ ఎఫెక్ట్ అవ్వడం తర్వాత సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడం తో పరిస్థితులు మారిపోగా సెకెండ్ వేవ్ తర్వాత టికెట్ రేట్లు నార్మల్ అవుతాయి అనుకుంటే అలా జరగలేదు… దాంతో…

పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలి అంటే బయపడగా ఉన్నంతలో మీడియం రేంజ్ మూవీస్ లో లవ్ స్టొరీ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు సక్సెస్ అయినా పెద్ద సినిమాలకు హోప్స్ లేని టైం లో డిసెంబర్ నెల నుండి వరుస పెట్టి పెద్ద సినిమాల జాతర…

మొదలు కాబోతున్నా ఎక్కడో డౌట్స్ ఉన్న నేపధ్యంలో అందరి చూపూ బాలయ్య అఖండ సినిమా మీద ఉండగా, సినిమా ఆడాలని కలెక్షన్స్ రావాలని అందరూ కోరుకున్నారు. ఇప్పుడు ఇదే నిజం అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ రాంపేజ్ ని చూపెడుతున్న అఖండ సినిమా ఓవరాల్ గా వీకెండ్ కే సినిమా బిజినెస్….

చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు రావడం ఖాయం అయ్యింది. ఇక వర్కింగ్ హోల్డ్ కూడా బాగుంటే ఇక వరుస రిలీజ్ ల జాతరలో కలెక్షన్స్ మ్రోత మ్రోగిపోవడం ఖాయమని చెప్పొచ్చు. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించిన తర్వాత రెండో రోజు ఎలా హోల్డ్ చేస్తుంది మూడో రోజు ఎలా ఉంటుంది అన్న డౌట్స్ కొంచం ఉన్నప్పటికీ సినిమా రెండు మూడు రోజుల్లో…..

అల్టిమేట్ అనిపించేలా హోల్డ్ చేయడంతో టోటల్ టాలీవుడ్ ఊపిరి పీల్చుకుందని చెప్పాలి. ఈ దెబ్బతో ఇక పుష్ప నుండి పెద్ద సినిమాల జాతర మరో వేవ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటే వచ్చే సమ్మర్ వరకు నాన్ స్టాప్ బ్యాటింగ్ తో దంచికొట్టడం ఖాయం అని చెప్పాలి. ఇక అఖండ సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here