మిగిలిన నెలలు ఎలా ఉన్నా టాలీవుడ్ లో ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలను అన్ సీజన్ గా భావిస్తారు… కానీ రీసెంట్ టైం లో ఈ నెలలలో కూడా కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చినా కానీ అన్ సీజన్ ఎఫెక్ట్ అయితే క్లియర్ గా ఉంటుంది…. ఫిబ్రవరి లో అయినా నోటబుల్ మూవీస్ రిలీజ్ అవుతాయోమో కానీ మార్చ్ లో పెద్ద సినిమాల రిలీజ్ లు చాలా రేర్ అని చెప్పాలి.
అలాంటి మార్చ్ నెలలో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన బలగం అనే చిన్న సినిమా ఊహకందని కలెక్షన్స్ తో పాజిటివ్ టాక్ పవర్ ని చూపిస్తూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని దక్కించుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.
కాగా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.3 కోట్ల మీద 12 రోజుల్లోనే 4.8 కోట్ల రేంజ్ లో లాభాన్ని అందుకోగా ఇప్పుడు 13వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 5 కోట్ల ప్రాఫిట్ మార్జిన్ ను దాటేసి మార్చ్ నెలలో జనాలు సినిమాలను చూడరు అన్న అపవాదుని వమ్ము చేస్తూ…
ఈ రేంజ్ లో ప్రాఫిట్ ను దక్కించుకుని దుమ్ము దుమారం లేపింది. ఇప్పటికీ సూపర్ స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా ఒక్క నైజాం ఏరియాలోనే ఇప్పుడు 10 కోట్ల గ్రాస్ మార్క్ ని అతి త్వరలో అందుకోబోతుంది. లాంగ్ రన్ లో సినిమా టోటల్ గా 16 కోట్ల నుండి 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం మించిపోయే ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు.