Home న్యూస్ హిట్ కొట్టి 10 ఏళ్ళు…గోపీచంద్ లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!

హిట్ కొట్టి 10 ఏళ్ళు…గోపీచంద్ లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!

0

ఒకప్పుడు మాస్ మార్కెట్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరోలలో మాచో స్టార్ గోపీచంద్(Gopichand) ఒకరు…కొన్ని మంచి మాస్ హిట్స్ పడ్డా కూడా కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేక పోయిన గోపీచంద్ లాస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది. 2014 టైంలో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్…

తర్వాత ఇప్పటి వరకు క్లీన్ హిట్ గీతని అయితే దాటలేదు అనే చెప్పాలి. తన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa)మాస్ సెంటర్స్ లో డీసెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నా టార్గెట్ ను అయితే అందుకోలేదు. టోటల్ రన్ లో 8.46 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా తో పాటు…

గోపీచంద్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ లెక్కలు కూడా చాలా నార్మల్ గా ఉన్నాయి. తన సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ను బాగానే జరుగుతూ ఉండటంతో నిర్మాతలకు పెద్దగా నష్టాలు రావడం లేదు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం గోపీచంద్ కి సాలిడ్ కంబ్యాక్ అయితే చాలా అవసరం అనే చెప్పాలి.

Bhima 2 Days Box Office Collections Update!

ఒకసారి గోపీచంద్ నటించిన లాస్ట్ 5 మూవీస్ లెక్కలను గమనిస్తే…. 
Gopichand Last 5 Movies Collections
👉#Bhimaa – 8.46CR****
👉#RamaBanam – 3.90CR
👉#PakkaCommercial – 8.81Cr
👉#Seetimaarr – 11.02Cr
👉#Chanakya – 4.48Cr
Total Last 5 Movies collections: 36.67Cr
Average 1 Movie Collections: 7.33Cr

మొత్తం మీద గోపీచంద్ లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ 36.67 కోట్లు మాత్రమే ఉండగా యావరేజ్ గా ఒక్కో సినిమా కి ఇప్పుడు 7.33 కోట్లు మాత్రమే వసూల్ చేస్తున్నాడు. ఇక గోపీచంద్ అప్ కమింగ్ మూవీస్ శ్రీనువైట్ల, రాధాకృష్ణ డైరెక్షన్ లో ఉండబోతుండగా ఆ సినిమాలు ఎంతవరకు అంచనాలను అందుకుని గోపీచంద్ కి కంబ్యాక్ మూవీస్ గా నిలుస్తాయో చూడాలి ఇక…

Bhima 4 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here