కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబో లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ముగించిన తర్వాత వర్కింగ్ డేస్ టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా కి 4 వ రోజు పార్షిక హాలిడే కలిసి రావడంతో సినిమా ఉన్నంతలో మంచి వసూళ్ళనే సొంతం చేసుకోగా నైజాంలో కొంచం బెటర్ గా హోల్డ్ చేసి ఉంటే లెక్క ఇంకా…
బెటర్ గా ఉండేది… ఇక సినిమా 5 వ రోజు ఫుల్ ఫ్లెట్చుడ్ వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా కి నైజాంలో డ్రాప్స్ కంటిన్యూ అవుతూ ఉండగా సీడెడ్ అండ్ ఆంధ్ర ఏరియాల్లో కూడా డ్రాప్స్ కనిపించగా దానికి తోడూ మరో ఎదురు దెబ్బ కూడా తగిలింది సినిమా కి…
పండగ కన్నా ముందే ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ అలాగే నైట్ కర్ఫ్యూ ఉండబోతుంది అంటూ ఆల్ రెడీ చెప్పిన ప్రభుత్వం, పండగ కోసం సడలింపు ఇచ్చి 18 నుండి ఇవి అమలు చేస్తామని చెప్పాగా, ఆ ఇంపాక్ట్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఆంధ్రలో….
50% ఆక్యుపెన్సీ తో రన్ అవుతూ ఉండగా కొన్ని థియేటర్స్ నైట్ కర్ఫ్యూ వలన నైట్ షోలకు ఇబ్బంది రాకూడదు అని షో టైమింగ్స్ ని మార్చి ఉదయం తొందరగా షోలను మొదలు పెట్టి మొత్తం మీద 4 షోలను వేయబోతుండగా ఎక్కువ శాతం థియేటర్స్ 3 షోలతోనే సరిపెట్టబోతున్నాయి. ఇక మొత్తం మీద సినిమా 5 వ రోజు ఆల్ మోస్ట్ 50% డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
ఈవినింగ్ అండ్ నైట్ షోల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా ప్రజెంట్ ట్రెండ్ ని చూస్తుంటే సినిమా 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల మధ్యలో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి నైట్ షోల టైం కి గ్రోత్ ఏమైనా ఉంటుందా లేక ఇదే విధంగా సినిమా పెర్ఫార్మ్ చేస్తుందో అన్నది చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి మరోసారి కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తాం.