ప్రతీ రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ తో అంచనాలను మించి పోతూ దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా 4 రోజుల్లో ఊచకోత కోసిన తర్వాత ఇప్పుడు 5వ రోజు మరోసారి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా…
మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉన్నప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊరమాస్ హోల్డ్ తో కొంచం ఇంపాక్ట్ అయితే పడింది…దాంతో ఆడియన్స్ సెకెండ్ బెస్ట్ ఛాయిస్ గా దూసుకు పోతున్న డాకు మహరాజ్ మాస్ సెంటర్స్ లో మాత్రం మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉంది..
ఉన్నంతలో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి ఇప్పుడు 5వ రోజున మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తున్న డాకు మహారాజ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 3.6-4 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకొంచం పెరిగే…
అవకాశం ఎంతైనా ఉంది…ఒకవేళ సినిమా 4.5-5 కోట్ల దాకా వెళితే మట్టుకు మరోసారి ఊహకందని ఊచకోత కోసిందని చెప్పొచ్చు…ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా 5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని…
5వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది…మొత్తం మీద ఒక పక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊరమాస్ రాంపెజ్ ను కొనసాగిస్తూ ఉన్నప్పటికీ డాకు మహారాజ్ కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా కుమ్మేస్తుంది. ఇక టోటల్ గా 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.