బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతార సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉంది, సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా ఇప్పుడు 5 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి.
సినిమా నాలుగో రోజుతో పోల్చితే ఇప్పుడు 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్ అయింది, అయినా కానీ ఆల్ రెడీ సినిమాకి భారీ లాభాలు సొంతం అవ్వగా ఇదంతా బోనస్ కిందే లెక్క అని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా 5వ రోజు మొత్తం మీద అటూ ఇటూగా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.2 కోట్ల దాకా కూడా వెళ్ళే అవకాశం…
ఉందని చెప్పాలి. అంతకన్నా ఎక్కువ వసూళ్లు సాధిస్తే సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. సినిమా మాస్ హోల్డ్ చూస్తుంటే దీపావళి మూవీస్ కి బిగ్గెస్ట్ త్రెట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది, ఇక టోటల్ 5 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.