డీసెంట్ రివ్యూలు వచ్చినా కూడా కలెక్షన్స్ ఓపెనింగ్స్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)సినిమా, మొదటి రోజు బాగానే జోరు చూపించినా తర్వాత మాత్రం కొంచం వర్కింగ్ డేస్ వలన స్లో డౌన్ అవ్వగా….
4వ రోజు నుండి మళ్ళీ వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపించగా ఇప్పుడు 5వ రోజున సండే అడ్వాంటేజ్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…
5వ రోజున మజాకా మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు మీద 10-15% రేంజ్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అలాగే నైట్ షోల ట్రెండ్ కనుక బాగుంటే ఓవరాల్ గా 80-85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి సినిమా 92-95 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక సినిమా మరీ అంచనాలను మించి నైట్ షోల ట్రెండ్ ఎక్స్ లెంట్ గా ఉంటే 1 కోటి రేంజ్ కి వెళ్ళొచ్చు కానే ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 5 రోజుల లాంగ్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.