Home న్యూస్ 5th డే కల్కి కలెక్షన్స్….వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!!

5th డే కల్కి కలెక్షన్స్….వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898AD(Kalki2898AD Movie) సెన్సేషనల్ జోరుని చూపించిన తర్వాత ఇప్పుడు మొదటి వర్కింగ్ డే లో కి ఎంటర్ అయ్యింది…

5వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా సినిమా హోల్డ్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన అన్ని చోట్లా డ్రాప్స్ అన్ని సినిమాలకు కామనే కాగా కల్కి మూవీ కూడా ఓవరాల్ గా డ్రాప్స్ ను బాగానే సొంతం చేసుకుంది అని చెప్పాలి 5వ రోజున ఇప్పుడు…

తెలుగు రాష్ట్రాలతో పోల్చితే సినిమా హిందీలో మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. తెలుగు లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో నైజాంలో సాలిడ్ హోల్డ్ ఉండగా ఆంధ్ర సీడెడ్ లలో డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి… ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఇప్పుడు…

5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు… ఇక హిందీ లో సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో పోల్చితే 30-35% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా…

హిందీలో సినిమా ఈ రోజు 16 కోట్ల నుండి ఆ పైన నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 17-18 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతకుమించి వస్తే మట్టుకు ఊరమాస్ హోల్డ్ అని చెప్పొచ్చు.

ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో ఓవరాల్ గా మంచి హోల్డ్ ఉండగా 4-5 కోట్ల రేంజ్ లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా 5వ రోజున ఇప్పుడు వరల్డ్ వైడ్ గా…

సినిమా 26-28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఒకవేళ సినిమా 30 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని కనుక అందుకుంటే వర్కింగ్ డే టెస్ట్ ను అద్బుతమైన కలెక్షన్స్ తో పాస్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక టోటల్ గా సినిమా 5 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here