నైజాం కలెక్షన్స్ ఇంకా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నా కానీ ఓవరాల్ గా సీటిమార్ సినిమా మంచి హోల్డ్ తోనే పరుగును కొనసాగిస్తూ వస్తుంది, సినిమా 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన దానికన్నా కూడా ఇంకా బెటర్ గా హోల్డ్ చేసి ఆశలు ఇంకా ఉన్నాయని నిరూపించి పరుగును కొనసాగిస్తుంది. సినిమా వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ పర్వాలేదు అనిపిస్తున్నా కానీ మొత్తం మీద బిజినెస్ ను అందుకునే రేంజ్ లో…
లేకపోవడం తో సినిమా లాంగ్ రన్ లో ఇది కచ్చితంగా ఇంపాక్ట్ చూపుతుందనిపించగా సినిమా 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 35 లక్షల రేంజ్ లోనే కలెక్షన్స్ ని అందుకునే రేంజ్ లో కనిపించినా కానీ ఓవరాల్ గా రోజును బాగానే ముగించిన ఈ సినిమా మొత్తం మీద….
6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 43 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 5 వ రోజు 51 లక్షల తో పోల్చితే 6 వ రోజు కేవలం 8 లక్షల రేంజ్ లోనే సినిమా డ్రాప్స్ ని సొంతం చేసుకోవడం నిజంగానే సాలిడ్ హోల్డ్ అని చెప్పాలి. సినిమా ఇక టోటల్ గా…
6 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.19Cr
👉Ceeded: 1.56Cr
👉UA: 1.04Cr
👉East: 82L
👉West: 46L
👉Guntur: 94L
👉Krishna: 47L
👉Nellore: 41L
Total AP TG: 7.89CR(13CR~ Gross)
👉KA+ROI: 30L
👉OS: 8L~(No release in USA)
TOTAL Collections: 8.27CR(13.80CR~ Gross)
సినిమాను టోటల్ గా 11.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.73 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక మొదటి వారాన్ని సినిమా ఏ రేంజ్ లో ముగిస్తుందో అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది..