Home TRP రేటింగ్ ఎవరు మీలో కోటీశ్వరులు 3rd వీక్ TRP రేటింగ్…ఆల్ టైం రికార్డ్!

ఎవరు మీలో కోటీశ్వరులు 3rd వీక్ TRP రేటింగ్…ఆల్ టైం రికార్డ్!

1648
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగేళ్ల తర్వాత బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు షో తో రీ ఎంట్రీ ఇవ్వగా మొదటి ఎపిసోడ్ నుండే రచ్చ చేయడం స్టార్ట్ చేయగా ఫస్ట్ డే మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా బాగా హోల్డ్ చేసింది… మొత్తం మీద ఈ షో మొదటి వారం మొత్తం మీద 6.76 రేటింగ్ ను సొంతం చేసుకోగా…

వర్కింగ్ డేస్ లో 5.62 రేటింగ్ ను సాధించింది… ఇక రెండో వారం మొత్తం వర్కింగ్ డేస్ లోనే టెలికాస్ట్ అవ్వగా మొదటి వారం వర్కింగ్ డేస్ తో పోల్చితే ఎక్కువ రేటింగ్ తో హోల్డ్ చేసిన ఈ షో ఏకంగా 6.48 రేటింగ్ ను సొంతం చేసుకుని సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది.

ఇక ఇప్పుడు మూడో వారానికి గాను ఈ షో సాధించిన రేటింగ్ లు రిలీజ్ అవ్వగా మూడో వారం ఏకంగా మొదటి 2 వారలను మించే రేంజ్ లో హోల్డ్ చేసి సూపర్ సాలిడ్ గా దూసుకు పోతున్న ఈ షో ఓవరాల్ గా 7.3 రేటింగ్ ను మూడో వారం లో సొంతం చేసుకుందని సమాచారం….

మూడో వారం ఈ షో సాధించిన రేటింగ్ ఓవరాల్ గా అన్ని సీజన్స్ లోకి ఒక వారం లో హైయెస్ట్ రేటింగ్ అని అంటున్నారు. ఈ రేంజ్ లో హోల్డ్ చేసి ఎక్కడో పాతాళానికి పడిపోయిన ఈ షో ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరిగి ఆడియన్స్ చూసేలా చేస్తూ ఉండగా షోల రేటింగ్ విషయంలో చాలా వెనక పడిపోయిన జెమినీ టీవీ కూడా ఇప్పుడు…

వారం వారం మంచి గ్రోత్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంటూ ఉండటం విశేషం. ఓవరాల్ గా మూడో వారం రెట్టించిన జోరు తో రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో ఇప్పుడు వచ్చే వారాల్లో మరింత జోరు చూపెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. టెలివిజన్ లో సూపర్ సాలిడ్ రేటింగ్ లతో యంగ్ టైగర్ దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here