కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ నుండి అలాగే అజిత్ కుమార్ ఫ్యాన్స్ కి బాగానే నచ్చినా కానీ రెగ్యులర్ ఆడియన్స్ నుండి మాత్రం మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది, ఆ ఇంపాక్ట్ వలెనే సినిమా రెండో రోజు నుండే ఆల్ మోస్ట్ 15 నిమిషాల ఫూటేజ్ ని…
డిలేట్ చేశారు సినిమా నుండి…. అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కుమ్మేసిన సినిమా ఓపెనింగ్స్ నుండే అల్టిమేట్ కలెక్షన్స్ తో రెచ్చిపోగా తెలుగు లో మాత్రం భీమ్లా నాయక్ సినిమా వలన ఇబ్బందులను ఫేస్ చేసి ఓపెనింగ్ డే తప్పితే తర్వాత…
థియేటర్స్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది సినిమా, అయినా కానీ లిమిటెడ్ కలెక్షన్స్ తోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కొనసాగిస్తూ ఇప్పుడు 6 రోజులు పూర్తీ అయ్యే సరికి తెలుగు డీసెంట్ కలెక్షన్స్ ని పోటి లో కూడా సొంతం చేసుకుంది.. ఒకసారి తెలుగు వర్షన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 51L
👉Ceeded: 28L
👉UA: 29L
👉East: 21L
👉West: 16L
👉Guntur: 20L
👉Krishna: 18L
👉Nellore: 14L
AP-TG Total:- 1.97CR(3.75CR~ Gross)
ఇక సినిమా 2.7 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 72 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇక తమిళ్ వర్షన్ తో కలిపి సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 114.25 కోట్ల గ్రాస్ ను అందుకోగా….
6 రోజులు పూర్తీ అయ్యే టైం కి ఓవరాల్ గా సినిమా 130 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 180 కోట్లు కాగా ఆ మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 50 కోట్ల గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది, మిక్సుడ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా…