బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి, కానీ అవే సినిమాలు కొన్ని సార్లు డిజిటల్ లో లేదా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన తర్వాత అప్పుడు చూడని వాళ్ళు ఆ సినిమాను పొగడటం అన్నది రీసెంట్ టైం లో కామన్ అయిపొయింది. రిలీజ్ అయినప్పుడు ఎవ్వరూ పట్టించు కోక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయిన మరో సినిమా ను ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్…
అయిన తర్వాత చూసి మంచి సినిమా అప్పుడెలా మిస్ అయ్యాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా లో… ఈ కోవ లోకి వచ్చిన కొత్త సినిమా రానా దగ్గుబాటి రెండేళ్ళకి పైగా కష్టపడి తీసిన అరణ్య మూవీ… ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ ను సొంతం చేసుకున్న…
ఈ సినిమా ను రిలీజ్ అయినప్పుడు అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు, అడవి నేపధ్యంలో అడవులను కాపాడుకోవడానికి ఒక వ్యక్తీ చేసే పోరాటం నేపధ్యంలో తెరకెక్కిన అరణ్య ఒక డిఫెరెంట్ జానర్ మూవీ అవ్వడంతో రెగ్యులర్ ఆడియన్స్ అసలు సినిమాను పట్టించుకోలేదు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా…
బడ్జెట్ వైజ్ చూసుకుంటే బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటి అనిపించుకునేలా రిజల్ట్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది, అదే సినిమా అప్పటి నుండి డిజిటల్ రిలీజ్ కి డీల్ కూడా సెట్ కాక పోవడం తో డిజిటల్ రిలీజ్ లేట్ అవుతూ రాగా రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ 6 నెలల తర్వాత డిజిటల్ రిలీజ్ డీల్ సెట్ అయ్యి జీ5 లో రిలీజ్ అవ్వగా…
అప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడు సినిమాను చూసి రానా పెర్ఫార్మెన్స్ అండ్ సినిమా కాన్సెప్ట్ బాగున్నా ఓవరాల్ గా కమర్షియల్ మూవీ అవ్వకపోవడంతో ఇంపాక్ట్ చూపలేదని కానీ సినిమా నచ్చింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇది బహుశా థియేటర్స్ లో కన్నా డిజిటల్ లోనే ఎక్కువ వర్కౌట్ అయ్యే కథ అని చెప్పాలి. డైరెక్ట్ రిలీజ్ కి అద్బుతమైన ఆఫర్స్ వచ్చినా నో చెప్పి థియేటర్స్ లో రిలీజ్ చేసి ఇలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు టీం..