ఇండియన్ మూవీస్ పరంగా ఎపిక్ బాక్స్ ఆఫీస్ రికార్డులను నమోదు చేస్తూ ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, 6 రోజులను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. హిందీ లో సినిమా కొంచం డ్రాప్స్ ను…
ఎక్కువ సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా మిగిలిన చోట్లతో పోల్చితే హిందీలోనే రిమార్కబుల్ హోల్డ్ ని చూపించింది సినిమా, ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా మరోసారి మంచి హోల్డ్ ని చూపించిన సినిమా 7 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే ఓవరాల్ గా….
7.51 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా కుమ్మేసింది. ఇక వరల్డ్ వైడ్ గా కొంచం అంచనాలను తప్పినా కూడా 30.91 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 67.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఓవరాల్ గా మరోసారి మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…
ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 6 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 70.30Cr
👉Ceeded: 24.18Cr
👉UA: 17.01Cr
👉East: 9.49Cr
👉West: 7.48Cr
👉Guntur: 12.13Cr
👉Krishna: 9.77Cr
👉Nellore: 5.69Cr
AP-TG Total:- 156.05CR(227.80CR~ Gross)
👉KA: 35.15Cr
👉Tamilnadu: 23.05Cr
👉Kerala: 6.40Cr
👉Hindi+ROI : 176.50Cr
👉OS – 82.05Cr***Approx
Total WW Collections : 479.20CR(Gross- 952.60CR~)
(78%~ Recovery)
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల మమ్మోత్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 78% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా మరో 140.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.