Home న్యూస్ 35th డే కల్కి….6th డే రాయన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

35th డే కల్కి….6th డే రాయన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అలాగే ధనుష్(Dhanush) కెరీర్ లో 50వ సినిమాగా రూపొందిన రాయన్(Raayan Movie) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్నాయి…

కల్కి ఇక 5వ వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా 35వ రోజు మరో వర్కింగ్ డే లో ఇప్పటికీ షేర్స్ ని అందుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 35వ రోజున 16 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా….

Kalki 2898 AD 33 Days Total World Wide Collections!!

హిందీలో మరోసారి పర్వాలేదు అనిపించగా వరల్డ్ వైడ్ గా సినిమా 45-50 లక్షల రేంజ్ లో షేర్ ని 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను ఇప్పుడు 35వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు.

ఇక 6వ రోజున మరోసారి వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన ధనుష్ రాయన్ మూవీ ఉన్నంతలో మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 25 లక్షల రేంజ్ నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

తమిళ్ లో 2.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి సినిమా 6వ రోజున ఇప్పుడు 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండు సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Dhanush Raayan 4 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here