వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా కూడా ప్రభాస్(Prabhas) కల్కి(Kalki 2898 AD) మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా 5వ వారంలో కూడా షేర్స్ ని రాబట్టిన సినిమా 5వ వారం ఎండ్ అయ్యే టైంకి స్లో అయినా కూడా మేకర్స్ సినిమా టికెట్ రేట్స్ పూర్తిగా తగ్గించి 6వ వారంలో డీసెంట్ థియేటర్స్ ని హోల్డ్ చేయగా….
6వ వారంలో తెలుగులో హిందీలో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వగా ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి టాక్ ను సొంతం చేసుకోలేక పోయింది. తెలుగు లో రిలీజ్ అయిన శివం భజే, బడ్డీ, తిరగాబడరా సామీ లాంటి సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ని చూపించడం లేదు…
ఇక హిందీలో అజయ్ దేవగన్ నటించిన ఔరోవ్ మే కహా దం తా(Auron Mein Kahan Dum Tha) ఎపిక్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో వీకెండ్ లో ఉన్న సినిమాల్లో ఆడియన్స్ కి ఒక్క బెటర్ ఆప్షన్ కూడా ఇప్పుడు లేకుండా పోయింది…
దాంతో తిరిగి అందరి కళ్ళూ ఇప్పుడు కల్కి మూవీ మీదనే ఉండగా సరైన టైంకి సినిమా టికెట్ రేట్స్ ను కూడా పూర్తిగా తగ్గించడం ఇప్పుడు కలిసి రాబోతుంది అని చెప్పాలి ఇప్పుడు. ఆ ఇంపాక్ట్ ఆల్ రెడీ సినిమా 38వ రోజు టికెట్ సేల్స్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండగా….
మంచి గ్రోత్ ని చూపిస్తూ ఉండటంతో ఈ వీకెండ్ లో తిరిగి కల్కి మూవీనే ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మారబోతుంది….డిజిటల్ రిలీజ్ కి ఇంకా టైం కూడా ఉండటంతో ఇది వరకు చూసిన ఆడియన్స్ అలాగే టికెట్ హైక్స్ వలన చూడలేక పోయిన ఆడియన్స్ వీకెండ్ లో కల్కి వైపే చూసే అవకాశం ఉంది. ఇక వసూళ్ళ పరంగా వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.