Home న్యూస్ ఇంకా 11 డేస్ ఉంది…అప్పుడే 7.5 కోట్లు ఔట్ సామి!!

ఇంకా 11 డేస్ ఉంది…అప్పుడే 7.5 కోట్లు ఔట్ సామి!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) తో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ముందు సెప్టెంబర్ ఎండ్ లో అనుకున్న సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు మరో లెవల్ లో ఉన్నాయి….దానికి తగ్గట్లు ట్రైలర్ కూడా అదరగొట్టడంతో ఇప్పుడు డిసెంబర్ 22న ఈ సినిమా సంచలనాలు సృష్టించడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓవర్సీస్ లో ఆల్ రెడీ స్టార్ట్ చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది అనే చెప్పాలి.

అమెరికాలో ఆల్ రెడీ హాల్ఫ్ మిలియన్ డాలర్స్ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఈ సినిమా, ఇక టోటల్ ఓవర్సీస్ గ్రాస్ లెక్క ఇప్పటి వరకు ఆల్ మోస్ట్ 9 లక్షల డాలర్స్ దాకా ఉండగా రిలీజ్ కి ఇంకా 11 రోజుల దాకా టైం ఉందని చెప్పాలి…

ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఇంకా 11 రోజులు ఉండగానే సొంతం చేసుకున్న సలార్ మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది రికార్డ్ ప్రీ బుకింగ్స్ తో ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ త్వరలో ఓపెన్ కానుండగా ఇక్కడ రెస్పాన్స్ ఇక రికార్డులు క్రియేట్ చేసేలా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here