బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు రాగా మొదటి రోజు నుండే సెన్సేషనల్ కలెక్షన్స్ ని మొదటి వీకెండ్ దాకా సొంతం చేసుకున్న ఈ సినిమా 3 రోజుల్లోనే చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టి సంచలనం సృష్టించింది, ఇక వర్కింగ్ డేస్ లో మినిమం హోల్డ్ చేసినా మొదటి వారం లోపే…
బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం అనుకున్నా వర్షాల వలన 4-5 రోజుల్లో ఎదురుదెబ్బ పడ్డ సినిమా మూమెంటమ్ ని 6-7 రోజుల్లో కోల్పోయింది, దానికి తోడూ ఆంధ్రలో లో టికెట్ రేట్లు 50% ఆక్యుపెన్సీనే ఉండటం తో ఎదురుదెబ్బ మరింత గట్టిగా తగిలింది ఈ సినిమాకి దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇప్పుడు.
మొదటి వారాన్ని ముగించుకున్న ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ పరంగా ఇండియాలోనే సెకెండ్ వేవ్ తర్వాత సెన్సేషనల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని అందుకున్నా కానీ సినిమా వీకెండ్ జోరు తో కంపేర్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి ఉండేది, సినిమా 7 వ రోజు 39 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుంది.
మొత్తం మీద ఇప్పుడు ఫస్ట్ వీక్ కి గాను సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 10.58Cr
👉Ceeded: 3.56Cr
👉UA: 2.48Cr
👉East: 1.35Cr
👉West: 1.13Cr
👉Guntur: 1.30Cr
👉Krishna: 1.12Cr
👉Nellore: 71L
AP-TG Total:- 22.23CR(36.10CR~ Gross)
Ka+ROI: 1.42Cr~(updated)
OS – 4.51Cr~
Total WW: 28.16CR(50.05CR~ Gross)(gross Corrected)
సినిమాను 31.2 కోట్ల రేటు కి అమ్మగా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద మొదటి వారం తర్వాత ఇంకా 3.84 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది, ఆంధ్రలో 100% ఆక్యుపెన్సీ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసి ఉంటే ఈ పాటికే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేది, కానీ 50% మాత్రమే రిపోర్ట్ చేయడంతో సెకెండ్ వీక్ లోనే ఇక బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.