Home న్యూస్ 1.5 రేటింగ్ తో 75 కోట్లు…ఊచకోత అంటే ఇదే!!

1.5 రేటింగ్ తో 75 కోట్లు…ఊచకోత అంటే ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. కాగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో ఆల్ మోస్ట్ 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.

అదే టైంలో సినిమా హిందీలో సాధించిన కలెక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఊచకోత కోస్తూ ఇప్పుడు 75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని 2 రోజుల్లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సినిమా మొదటి రోజు 37 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకోగా రెండో రోజు కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా మొదటి రోజుకి మించి 38 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని రెండో రోజు లో సొంతం చేసుకుంది. దాంతో రెండు రోజుల్లో సినిమా 75 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని హిందీ లో సొంతం చేసుకుంది….

సినిమాకి హిందీలో మేజర్ ట్రేడ్ నుండి తీవ్రమైన నెగటివ్ రివ్యూలు వచ్చాయి. బాలీవుడ్ టాప్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ సినిమాకి 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. దాంతో ఇక సినిమా తేరుకునే అవకాశమే లేదని అనుకున్నారు అందరూ… కానీ సినిమా 2 రోజుల్లోనే ఇప్పుడు ఏకంగా…

75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపించి పరుగును కొనసాగిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

Adipurush 1st Day Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here