Home న్యూస్ 4 సార్లు 200 కోట్లు….దంచికొడుతున్న రెబల్ స్టార్!

4 సార్లు 200 కోట్లు….దంచికొడుతున్న రెబల్ స్టార్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్(Prabhas) ఆ సినిమాతో వచ్చిన పేరుని సాహో సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా మిగిలిన స్టార్స్ తో పోల్చితే భారీ వసూళ్ళని సొంతం చేసుకున్నాడు. కానీ రాధే శ్యామ్ అనే సినిమా మాత్రం…

ఎపిక్ ఫ్లాఫ్ గా నిలిచింది… ఇక తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ సినిమా టీసర్ టైంలో భారీ ట్రోల్స్ ని ఫేస్ చేయగా తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా ఇప్పుడు రిలీజ్ అయ్యాక తిరిగి ఎక్స్ ట్రీం ట్రోల్స్ ని ఫేస్ చేస్తున్న ఈ సినిమా విమర్శలు ఒక పక్క వస్తున్నా…

Adipurush 1st Day Total World Wide Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సాలిడ్ గా రచ్చ చేస్తూ దుమ్ము లేపుతూ ఇప్పుడు 2 రోజుల్లోనే 200 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ప్రభాస్ కెరీర్ లో 4 వ 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది ఆది పురుష్(AdiPurush) సినిమా ఇప్పుడు…

ఇది వరకు బాహుబలి1, బాహుబలి2 సిరీస్ లు ఒకటి తర్వాత ఒకటి ఈ మార్క్ ని దాటేయగా తర్వాత సాహో సినిమా సైతం ఈ మార్క్ ని అధిగమించింది, కానీ రాధే శ్యామ్ అట్టర్ ఫ్లాఫ్ తర్వాత ఇప్పుడు తిరిగి ఆదిపురుష్ మూవీ తో మరో 200 కోట్ల సినిమాను…

తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ టాలీవుడ్ హీరోలలో ఏ హీరో అందుకోని ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు… ఇక ఆదిపురుష్ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి. ట్రోల్స్ ఒక పక్క వస్తున్నా కలెక్షన్స్ కూడా సూపర్ సాలిడ్ గానే ఉండటం విశేషం అని చెప్పాలి.

Prabhas Adi Purush Pre Release Business!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here