Home న్యూస్ ఇంకో 7 కోట్లు వస్తే…..SRK పఠాన్ ఔట్….రెబల్ స్టార్ ఎపిక్ రాంపెజ్!

ఇంకో 7 కోట్లు వస్తే…..SRK పఠాన్ ఔట్….రెబల్ స్టార్ ఎపిక్ రాంపెజ్!

1

ఎపిక్ కలెక్షన్స్ తో సూపర్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన కల్కి(Kalki 2898 AD movie) 5వ వారంలో కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఆల్ రెడీ 1000 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించిన సినిమా….

33 రోజుల్లో ఓవరాల్ గా 1042.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దాటేసిన కల్కి మూవీ 34వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 1044 కోట్ల మార్క్ ని దాటేయబోతూ ఉండగా సినిమా ఎపిక్ రన్ ని మరి కొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక సినిమా ఓవరాల్ గా ఇండియన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీగా దూసుకు పోతూ ఉండగా ఇక సినిమా మిగిలిన రన్ లో మరో 7 కోట్ల గ్రాస్ మార్క్ ని కనుక అందుకుంటే 1000 కోట్ల సినిమాల్లో మరో అడుగు ముందుకు వేసే అవకాశం ఉంటుంది…

కాగా సినిమా మిగిలిన రన్ లో మరో 7 కోట్లకు పైగా గ్రాస్ ను కనుక సొంతం చేసుకుంటే 1051 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సినిమా బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన ఎపిక్ కంబ్యాక్ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయిన…

పఠాన్(Pathaan Movie) టోటల్ రన్ గ్రాస్ కలెక్షన్స్ ని బీట్ చేసే అవకాశం ఉంటుంది. పఠాన్ మూవీ టోటల్ రన్ లో 1051 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని షారుఖ్ కెరీర్ లోనే ఆల్ టైం ఎపిక్ కంబ్యాక్ ను అందుకుని మాస్ రచ్చ చేసింది….

ఇక ఇప్పుడు కల్కి మూవీ అన్ని చోట్లా పరుగు ఇప్పుడు 5వ వారంలో కొంచం స్లో అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో హిందీలో అలాగే ఓవర్సీస్ లో లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండటంతో మిగిలిన రన్ లో పఠాన్ ని అందుకుంటుందో లేదో అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీకెండ్ లో తిరిగి కొంచం జోరు చూపించినా కూడా అవలీలగా పఠాన్ ని దాటేసే అవకాశం ఉంటుంది.

Kalki 2898 AD 33 Days Total World Wide Collections!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here