బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది. ఓవరాల్ గా సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత డ్రాప్స్ ను మరింత ఎక్కువగానే సొంతం చేసుకోగా ఇక టార్గెట్ ను అందుకునే విషయంలో దూరం లోనే ఆగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉండగా…సినిమా ఇప్పుడు 6వ రోజు తో పోల్చితే…
7వ రోజున మరో వర్కింగ్ డే లో మరోసారి డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకున్న సినిమా కనీసం 5 వేల రేంజ్ లో కూడా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోలేక పోతుంది ఇప్పుడు…ఓవరాల్ గా ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ కూడా ఉన్న నేపధ్యంలో…
సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూ గా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ కొద్ది వరకు పెరిగే అవకాశం ఉండగా… ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా….
జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో 25 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సినిమా 7వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉండగా…సినిమా మొత్తం మీద ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతుండా లేక ఏమైనా గ్రోత్ ని చూపెడుతుందో చూడాలి ఇప్పుడు….