Home న్యూస్ 5Cr తో 25 కోట్లు….చరిత్ర సృష్టించిన అర్జున్ రెడ్డికి 7 ఏళ్ళు!!

5Cr తో 25 కోట్లు….చరిత్ర సృష్టించిన అర్జున్ రెడ్డికి 7 ఏళ్ళు!!

0

ఏడాది పొడవునా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ ను అలరిస్తాయి, కొన్ని సినిమాలు భారీ లాభాలను అందుకుంటాయి, కానీ కొన్ని సినిమాలు కల్ట్ క్లాసిక్ స్టేటస్ తో పాటు హ్యుమంగస్ విజయాలను నమోదు చేసి ఎక్కువ టైం ఇంపాక్ట్ ని ఆడియన్స్ పై పడేలా చేస్తాయి…

అలాంటి సినిమాల్లో ముందు నిలిచే సినిమాల్లో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన కల్ట్ మూవీ అర్జున్ రెడ్డి(Arjun REDDY) మూవీ ముందు నిలుస్తుంది….భారీ ఇంపాక్ట్ ను ఆడియన్స్ లో పడేలా చేసిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి….

7 ఏళ్ళు పూర్తి చేసుకుంది…ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి రిలీజ్ టైంలోనే కల్ట్ స్టేటస్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…

2017 టైంలో అందరూ బాహుబలి2 మ్యానియా నుండి అప్పుడప్పుడే బయటికి వస్తున్న టైంలో చిన్న సినిమానే అయినా డీసెంట్ బజ్ తో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి మూవీ 5 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుని వినాయక చవితి కానుకగా రిలీజ్ అవ్వగా…

ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకుని రెండో రోజుకే ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకోగా అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని బిజినెస్ మీద ఏకంగా 20 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని…

క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, ఈ సినిమా ఇంపాక్ట్ తో హ్యూజ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మీడియం రేంజ్ హీరోలలో మంచి క్రేజ్ ను అందుకున్న హీరోగా నిలిచాడు….ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ హిందీలో ఇదే సినిమాను రీమేక్ చేసి తర్వాత యానిమల్ తో మరో బ్లాక్ బస్టర్ కొట్టి క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరిగా దూసుకు పోతున్నాడు. ఇలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు అవ్వడం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here