Home న్యూస్ 80 లక్షల రేటు…4 నెలల తర్వాత రిలీజ్ అయినా ఫస్ట్ డే సెన్సేషనల్ వ్యూస్ వచ్చాయి!

80 లక్షల రేటు…4 నెలల తర్వాత రిలీజ్ అయినా ఫస్ట్ డే సెన్సేషనల్ వ్యూస్ వచ్చాయి!

0

ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీస్ లో మాస్టర్ తర్వాత తెలుగు లో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో కన్నడ స్టార్ ధృవ్ సార్జా మరియు రష్మిక మందన కలిసి నటించిన సినిమా పొగరు అనే చెప్పాలి. అసలు ఏమాత్రం పరిచయం లేని హీరో అయిన ధృవ్ సార్జా పొగరు సినిమా సాంగ్స్ వలన మంచి పాపులారిటీ ని సొంతం చేసుకోవడం తో…

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లోనే రిలీజ్ అవ్వగా తెలుగు రైట్స్ కూడా అద్బుతమైన రేటు ని సొంతం చేసుకున్నాయి, కానీ సినిమా ఆశించిన రేంజ్ లో లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేక ఫ్లాఫ్ గా నిలిచింది…

కానీ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ సినిమా కి ఎంతో కొంత పాపులారిటీ ఆడియన్స్ లో రావడం తో సినిమాను ఆహా వీడియో వాళ్ళు డిజిటల్ రైట్స్ ని తెలుగు వరకు సొంతం చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన 4 నెలల తర్వాత సిన్నిమా డిజిటల్ రైట్స్ హక్కులను ఏకంగా…

80 లక్షల రేంజ్ రేటు చెల్లించి రైట్స్ ని సొంతం చేసుకోగా సినిమాను రీసెంట్ గా ఆహా లో అప్లోడ్ చేశారు. కాగా సినిమా కి ఫస్ట్ డే మొత్తం మీద యూనిక్ వ్యూస్ 1 లక్షా 15 వేల రేంజ్ లో వచ్చాయని అంచనా వేస్తున్నారు. సినిమాను కొన్న రేటు కి రిలీజ్ అయిన గ్యాప్ లెక్కన చూసుకున్నా ఇది అల్టిమేట్ వ్యూస్ అనే చెప్పాలి. ఆహా వీడియో ఒక నెల రేటు…

50 ని సినిమా టికెట్ రేటుగా అనుకుంటే 1 లక్షా 15 వేల వ్యూస్ కి 57.5 లక్షల గ్రాస్ ని మొదటి రోజే సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చు అని చెప్పాలి. పెట్టిన రేటు లో 75% శాతం ఫస్ట్ డే నే రికవరీ చేసింది ఈ సినిమా. ఇక వీకెండ్ కే సినిమా పెట్టిన మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here