Home న్యూస్ 8 డేస్ ఛావా తెలుగు కలెక్షన్స్….ఆగని ఊరమాస్ జాతర!!

8 డేస్ ఛావా తెలుగు కలెక్షన్స్….ఆగని ఊరమాస్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా మొదటి వీక్ ని కంప్లీట్ చేసుకుని రెండో వీక్ లో అడుగు పెట్టగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సినిమా రెండో వీక్ లో కొత్త సినిమాల మధ్య…

పోటిలో కూడా మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం…సినిమా 7వ రోజుతో పోల్చితే 8వ రోజు మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ ఉండగా 7వ రోజున 85 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…. 8వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన ఛావా సినిమా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా….ఓవరాల్ గా 8వ రోజున 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 8 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో…

ఛావా సినిమా 14.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 7.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ ఈ వీకెండ్ లో మళ్ళీ అన్ని చోట్లా దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…

3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఓవరాల్ గా 4.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఏకంగా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వీకెండ్ లో ప్రాఫిట్స్ ను మరింతగా పెంచుకుని సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here