బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) ఆడియన్స్ ముందుకు లాస్ట్ వీక్ లో రాగా సినిమాకి మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా తర్వాత ఏ దశలో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది అనే చెప్పాలి…
సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ నిరాశ పరిచిన తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయింది. సినిమా 8 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రాప్ అయిన సినిమా 30 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Family Star 8 Days Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 4.68Cr
👉Ceeded: 89L
👉UA: 1.00Cr
👉East: 62L
👉West: 51L
👉Guntur: 65L
👉Krishna: 60L
👉Nellore: 50L
AP-TG Total:- 9.45CR (16.75CR~ Gross)
👉KA+ROI: 1.24Cr
👉OS: 4.73Cr
Total WW:- 15.43CR(29.40CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 44 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజులు పూర్తి అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 28.57 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది దాదాపు అసాధ్యంగా కనిపిస్తూ ఉండగా వీకెండ్ లో సినిమా ఏమైనా గ్రోత్ ని సినిమా చూపిస్తుందో చూడాలి ఇక…