బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 100 కోట్ల షేర్ మార్క్ ని దాటేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie)…ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా రెండో వీక్ లో సినిమా స్క్రీన్ కౌంట్ చాలా వరకు తగ్గింది ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాలు అలాగే ఇతర రాష్ట్రాల్లో డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకుంటే ఓవరాల్ గా సినిమా 8వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే….
షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. నైజాంలో సినిమా కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది…ఇక సినిమా మిగిలిన చోట్ల కూడా ఈ రోజు డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా హిందీ లో కూడా స్క్రీన్ కౌంట్ తగ్గడంతో అక్కడ కూడా కలెక్షన్స్ లో డ్రాప్స్ ఉండగా…
ఓవరాల్ గా సినిమా ఇక తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదు…ఉన్నంతలో ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా వరల్డ్ వైడ్ గా 8వ రోజున 1.8-2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే..
షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది కానీ ఈ మొత్తం అసలు ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ దగ్గరగా వెళ్ళడానికి కూడా సరిపోవు అనే చెప్పాలి. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప సినిమా తేరుకోవడం ఇక కష్టమే…ఇక టోటల్ గా సినిమా 8 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.