మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(Ka Movie), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) లక్కీ భాస్కర్(Lucky Baskhar) మరియు శివ కార్తికేయన్(Siva Kartikeyan) అమరన్(Amaran) సినిమాలు రెండో వారంలో అడుగు పెట్టి దుమ్ము లేపుతున్నాయి…
అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ రచ్చ చేస్తూ ఉండగా రెండో వారంలో అన్ని సినిమాలు వేటి రేంజ్ లో అవి బాగానే హోల్డ్ ని చూపెడుతున్నాయి. క మూవీ 8వ రోజు బాక్స్ అఫీస్ దగ్గర మరోసారి పర్వాలేదు అనిపిస్తూ ఉండగా…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా 55-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా ఇప్పుడు 8వ రోజున అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక లక్కీ భాస్కర్ మూవీ 8వ రోజు తెలుగు రాష్ట్రలలో 50-55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా మంచి హోల్డ్ ని చూపెడుతూ సినిమా ఇప్పుడు 3 కోట్ల రేంజ్ నుండి…
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 3.5 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక అమరన్ మూవీ మరోసారి ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
తమిళ్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరుని చూపెడుతూ 6.5-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు. ఇక అన్ని సినిమాల 8 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.