Home న్యూస్ 8 సార్లు పోస్ట్ పోన్ అయిన 110 కోట్ల సినిమా…ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫాం!!

8 సార్లు పోస్ట్ పోన్ అయిన 110 కోట్ల సినిమా…ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫాం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇండియన్ మూవీస్ లో దాదాపు పెండింగ్ ఉన్న సినిమాలు అన్నీ కూడా ఎప్పుడో రిలీజ్ అయ్యాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కుదరక పోతే డైరెక్ట్ గా డిజిటల్ లో అయినా రిలీజ్ అయ్యాయి కానీ రిలీజ్ ఆగిపోయిన సినిమా అంటే ఒక్కటి మాత్రమె రిలీజ్ కి నోచుకోలేదు….

ఎప్పటి నుండో రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్న ఆ సినిమా ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు 8 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఆ సినిమానే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటించిన మైదాన్(Maidaan Movie)… ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఎప్పటి కప్పుడు రిలీజ్ ఆగిపోతూ వచ్చింది…

ఆల్ మోస్ట్ 110 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఒక దశలో RRR మూవీ కి పోటిగా ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతూ రాగా ఎట్టకేలకు ఇప్పుడు 2024 లో సినిమా రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది…. ఈ సినిమా ఇప్పుడు ఈ ఇయర్ రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేశారు…

రీసెంట్ గా అనౌన్స్ మెంట్ జరిగింది…కానీ సినిమా ప్రమోషన్స్ పనులు అయితే ఇప్పటి వరకు ఏమి జరగలేదు…. రిలీజ్ కి ఇంకా నెలన్నర టైం ఉండగా సినిమాకి పోటిగా మరో బిగ్ మూవీ బడే మియ్యా చోటే మియ్యా సినిమా రిలీజ్ కానుండటంతో ఈ సినిమా ఎంతవరకు రిలీజ్ ను కన్ఫాం చేసుకుని ఈ సారి అయినా ఆడియన్స్ ముందుకు వస్తుందో లేదో అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here