యూత్ స్టార్ నితిన్ వరుస ఫ్లాఫ్స్ పడ్డ టైం లో భీష్మ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ని ఇచ్చాడు కానీ తర్వాత చేసిన చెక్ సినిమా కానీ రంగ్ దే సినిమా కానీ పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీత ని అందుకోలేక భారీ నష్టలనే మిగిలించాయి. ఈ కారణం వలనే నితిన్ లేటెస్ట్ మూవీ మాస్ట్రో సినిమాకి….
థియేట్రికల్ ఆఫర్స్ ఆశించిన మేర రాక పోవడం అదే టైం లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు 34 కోట్ల రేటు ఆఫర్ ఇవ్వడంతో సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒరిజినల్ చూసిన వాళ్ళకి పర్వాలేదు బాగుంది అనిపించగా…
చూడని వాళ్ళకి మాత్రం ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తూ సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా ఈ సినిమా తర్వాత నితిన్ ఒప్పుకున్న సినిమాల్లో పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో రెండు పార్టులుగా అనౌన్స్ చేసిన సినిమా పవర్ పేట గురించి మాట్లాడుతూ…
ఆ సినిమా ను ఇక ఆపెశామని, కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఆ సినిమా రద్దు అయ్యిందని కన్ఫాం చేశాడు నితిన్. ఆల్ మోస్ట్ 90 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ ఎత్తున కంప్లీట్ మాస్ మూవీ గా ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నాం అంటూ లాస్ట్ ఇయర్ చెప్పిన నితిన్ ఇప్పుడు కొన్ని కారణాల వలన ఈ సినిమాను కంప్లీట్ గా ఆపేశాం అని చెప్పగా ఈ సినిమా ప్లేస్ లో…
ఇప్పుడు ఒప్పుకున్న మాచర్ల నియోజకవర్గం సినిమా రా రస్టిక్ నేపధ్యంలో వింటేజ్ మాస్ కంటెంట్ తో అదిరిపోతుందని చెబుతున్నాడు నితిన్…. మాస్ట్రో థియేటర్స్ లో మిస్ అయినా ఈ సినిమా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుంది అంటున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ని నితిన్ సొంతం చేసుకోవాలని మనమూ విష్ చేద్దాం…