Home న్యూస్ 6 కోట్ల సినిమా….4.5 కోట్లకి అమ్మితే…3 రోజుల్లో వచ్చింది ఇది!!

6 కోట్ల సినిమా….4.5 కోట్లకి అమ్మితే…3 రోజుల్లో వచ్చింది ఇది!!

1774
1

విజయ్ ఆంథోని నటించిన లేటెస్ట్ మూవీ విజయ రాఘవన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తమిళ్ లో డీసెంట్ టాక్ ని సొంతం చేసుకన్నా తెలుగు లో యావరేజ్ రేంజ్ టాక్ నే దక్కించుకుంది, దానికి తోడూ పెద్దగా ప్రమోషన్స్ ఏమి తెలుగు లో చేయక పోవడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక్కడ భారీగానే నిరాశ పరిచే కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది ఇప్పుడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కి గాను తెలుగు లో 16 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోగా రెండో రోజు 5 లక్షల షేర్ ని మూడో రోజు 4 లక్షల షేర్ ని సాధించింది. టోటల్ గా 3 రోజుల్లో సినిమా తెలుగు లో 25 లక్షల షేర్ ని 40 లక్షల గ్రాస్ ను అందుకోగా…

తెలుగు లో సినిమాను 1.3 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 1.5 కోట్ల టార్గెట్ కి మూడు రోజుల తర్వాత మరో 1.25 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది, ఇక తమిళ్ లో మట్టుకు సినిమా అద్బుతమైన కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకుంది.

అక్కడ మొదటి రోజు 1.45 కోట్ల గ్రాస్ ను, రెండో రోజు 1.55 కోట్ల గ్రాస్ ను అందుకోగా మూడో రోజు రెట్టించిన జోరు చూపెట్టి 2.1 కోట్ల గ్రాస్ ను అక్కడ వసూల్ చేసింది. దాంతో మొదటి వీకెండ్ లో సినిమా అక్కడ 5.10 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. తమిళ్ లో సినిమాను 3.2 కోట్ల రేంజ్ లో అమ్మగా…

సినిమా బ్రేక్ ఈవెన్ కి 6 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంది, ఇక వర్కింగ్ డేస్ కలెక్షన్స్ తో అక్కడ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు… సినిమా మొత్తం మీద 4.5 కోట్ల బిజినెస్ కి 3 కోట్ల మేర షేర్ ని ఇప్పటికే సొంతం చేసుకుంది. ఇక మొదటి వారం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా హిట్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here