నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాల తర్వాత కెరీర్ బెస్ట్ ఫామ్ లో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న తన కొత్త సినిమాను ఈ దసరాకి ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతూ ఉండగా ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమా రీసెంట్ గా కన్ఫాం అయింది…
ముందు వేరే డైరెక్టర్స్ తో అనుకున్నా కూడా బాలకృష్ణ(Balakrishna) తన తర్వాత సినిమాను వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో చేయబోతున్నాడు… సితారా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుంది, ఇక ఈ సినిమా గురించిన ఓ వార్తా ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
వచ్చే ఏడాది ఎలక్షన్స్ ఉన్న నేపధ్యంలో ఆ పనుల్లో ఫుల్ బిజీగా బాలయ్య ఉండే అవకాశం ఉండటంతో ఈ సినిమాను చాలా తక్కువ టైంలో పూర్తీ చేయాల్సి ఉంటుంది అని డైరెక్టర్ కి బాలయ్య కండీషన్ పెట్టాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మొత్తం మీద 90 రోజుల టైం గ్యాప్ లో…
ఈ సినిమా షూటింగ్ మొత్తం అయిపోవాలని బాలయ్య చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది, బాబీ తక్కువ టైంలోనే వాల్తేరు వీరయ్య సినిమాను పెద్దగా లెంత్ కూడా పెంచకుండా తక్కువ సీన్స్ నే ఎడిటింగ్ లో తీసేలా పెర్ఫెక్ట్ బడ్జెట్ లో తెరకెక్కించాడు, అందుకే ఈ సినిమా కూడా ఇలానే పెర్ఫెక్ట్ గా అవ్వాలని భావిస్తున్నారట. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి.