బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) మరియు రణబీర్ కపూర్(Ranbir Kapoor) ల క్రేజీ కాంబోలో వచ్చిన యానిమల్(Animal Movie) ఏ సర్టిఫికెట్ తో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది, సినిమా రిలీజ్ అయినప్పుడు కొందరు సినిమాను విమర్శించినా కూడా…
సినిమా వసూళ్ళ ప్రభంజనం చూసి పెద్దగా ట్రోల్స్ ఏమి చేయలేదు, కానీ సినిమా ఎప్పుడైతే 700 కోట్ల రేంజ్ గ్రాస్ ను దాటింతో అప్పటి నుండి తమిళ్ లో సినిమా మీద ట్రోల్స్ పెరిగిపోగా టోటల్ రన్ లో దుమ్ము దుమారం లేపుతూ 913 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటింది…. లాస్ట్ ఇయర్ కోలివుడ్ బిగ్ మూవీస్ కలెక్షన్స్ ని తెలుగు డైరెక్టర్ సినిమా డామినేట్ చేయడంతో ట్రోల్స్ మరో లెవల్ కి వెళ్ళాయి….
కోలివుడ్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ తో జవాన్ బ్లాక్ బస్టర్ కొట్టినా ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూతో పోల్చితే యానిమల్ మూవీ ఆర్గానిక్ గా వసూళ్ళ ప్రభంజనం సృష్టించడం కోలివుడ్ లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్కాలేదు, అలాగే సినిమాలో హీరోయిన్స్ ని చూపించిన తీరు, హీరో ప్రవర్తనని ట్రోల్స్ రూపంలో వాడుకుంటూ…
కోలివుడ్ లో ఒక సెక్షన్ సినిమాను ట్రోల్ చేస్తూనే ఉండగా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ తర్వాత అది మరింతగా పెరిగి పోయింది, మిగిలిన ఇండస్ట్రీల ఆడియన్స్ సినిమాను సినిమాలా చూసి ఓవరాల్ గా యానిమల్ ను ఎంజాయ్ చేస్తూ ఉండగా మరో పక్క కోలివుడ్ వాళ్ళు మాత్రం తమ అతిని చూపిస్తూ ట్రోల్స్ డోస్ ని పెంచగా…
డిఫెండ్ చేసుకోవడానికి టోటల్ టాలీవుడ్ ఏకమై కౌంటర్ ట్రోల్స్ చేస్తున్నారు, సినిమా అంతలా ప్రభావితం చేసేలా ఉంటే లియో లాంటి టాప్ స్టార్ నటించిన సినిమాలో నరబలి కాన్సెప్ట్ ను హైలెట్ చేయడం కూడా అందరిలో ప్రభావితం చేస్తుందా అంటూ కామెంట్ చేస్తున్నారు, ఓవరాల్ గా సినిమాను సినిమా లా చూసి ఆ సినిమా చూడటం అయ్యాక అక్కడితో వదిలి పెడితే ఏ గొడవ ఉండదు అని చెప్పొచ్చు. ఈ సినిమాకే ఇలా ఉంటే యానిమల్ పార్క్ కి ట్రోల్స్ డోస్ ఇంకా పెంచే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.
How much did you get to support a psycho film