బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రిలీజ్ అయినప్పటి నుండి కూడా విపరీతమైన ట్రోల్స్ ని, ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే… హిందీలో అయితే సినిమా మీద వచ్చిన ట్రోల్స్…
రీసెంట్ టైంలో ఏ సినిమా మీద కూడా రాలేదు. ఇక తెలుగు లో కూడా సినిమా మీద భారీ లెవల్ లో ట్రోల్స్ రాగా సినిమా ఇక తేరుకునే అవకాశం లేక పోయింది. కానీ మొదటి వీకెండ్ లో సినిమా భారీ లెవల్ లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ హెల్ప్ తో సినిమా…
వర్కింగ్ డేస్ లో స్లో అయినా కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు వర్షన్ కింద 100 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా ఈ మైలురాయిని ఇలాంటి ట్రోల్స్ ని ఫేస్ చేసుకున్నాక కూడా అందుకోవడం విశేషం…
ఇక సినిమా మొత్తం మీద 9 రోజుల్లో తెలుగు వర్షన్ కింద సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 34.88Cr
👉Ceeded: 9.27CR
👉UA: 9.90Cr
👉East: 5.83Cr
👉West: 4.16Cr
👉Guntur: 6.51Cr
👉Krishna: 4.29Cr
👉Nellore: 2.16Cr
AP-TG Total:- 77.00CR(123.60Cr~ Gross)
👉Karnatak+ROI: 10.75Cr~
👉OS – 12.55Cr~
Total WW: 100.30CR(170.50CR~ Gross)
సినిమా తెలుగు వర్షన్ కి టోటల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 150 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 152 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పుడు సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 51.7 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.