Home న్యూస్ బాలీవుడ్ కి ఊపిరి పోసిన సినిమా….సైలెంట్ గా వచ్చి ఇన్ని కోట్లు వసూల్ చేసింది!

బాలీవుడ్ కి ఊపిరి పోసిన సినిమా….సైలెంట్ గా వచ్చి ఇన్ని కోట్లు వసూల్ చేసింది!

0

ఈ ఇయర్ బాలీవుడ్ వాళ్ళకి ఒకటి రెండు సినిమాలు మినహా ఇప్పటి వరకు పెద్దగా ఏమి కలిసి రాలేదు, కానీ ఓ మూడు నాలుగు సినిమాల రేంజ్ కలెక్షన్స్ ని షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన పఠాన్(Pathaan) మూవీ రాబట్టగా తర్వాత కాంట్రవర్సీల హెల్ప్ తో…

ది కేరళ స్టొరీ(The Kerala Story) దుమ్ము లేపింది, కానీ ఓ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఇప్పుడు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమానే జర హట్ కే జరా బచ్ కే…. విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ ల కాంబోలో…

వచ్చిన ఈ సినిమా పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోగా రిలీజ్ అయిన 3 వారాల తర్వాత కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతూ 22వ రోజు 1.35 కోట్లు వసూల్ చేస్తే 23 వ రోజు 2.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపుతూ ఇప్పుడు…

బాక్స్ ఆఫీస్ దగ్గర 76 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు అందుకుని దూసుకు పోతుంది. సినిమా కి ఆడియన్స్ నుండి లాంగ్ రన్ లో కూడా ఇలాంటి వసూళ్లు వస్తూ ఉండటం విశేషం. 24 వ రోజు సండే అవ్వడంతో సినిమా ఇప్పుడు…

3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా సైలెంట్ గా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా బాలీవుడ్ కి ఓ మంచి హిట్ గా ఊపిరి పోసి చిన్న సినిమాలు, ఫ్యామిలీ సబ్జెక్ట్ లు ఇప్పటికీ కంటెంట్ బాగుంటే హిట్ అవుతాయి, జనాలు థియేటర్స్ కి వస్తారు అని నిరూపించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here