మొదటి వారంలో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రికవరీని సొంతం చేసుకుని క్లీన్ హిట్ వైపు వెళుతున్నా కూడా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇకొంచం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా …
రెండో వీక్ లో వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా లాంగ్ ఫెస్టివల్ వీక్ తర్వాత వచ్చిన వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వడంతో కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకుంటుంది ఇప్పుడు…..8వ రోజుతో పోల్చితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సినిమా ఓవరాల్ గా 70% రేంజ్ లో…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా మాస్ సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పర్వాలేదు అనిపించేలా ఉండటంతో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 55-60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా…
షేర్ కొంచం పెరిగే అవకాశం ఉండగా, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సైతం ఈ రోజు డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 70 లక్షల రేంజ్ నుండి 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి..
మొదటి వారంలో చాలా వరకు రికవరీని సొంతం చేసుకోవడం సినిమాకి కలిసి వచ్చింది కానీ ఇప్పుడు కొంచం డ్రాప్స్ హెవీగానే ఉన్నాయి అని చెప్పాలి. కానీ అందుకోవాల్సిన టార్గెట్ కొంచం చిన్నదే కాబట్టి మిగిలిన రన్ లో టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 9 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.