Home న్యూస్ పొలిమేర2 బిజినెస్…అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

పొలిమేర2 బిజినెస్…అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

0

2021 టైంలో అప్పటి కోవిడ్ పరిస్థితుల నడుమ థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన చాలా సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అవ్వగా అలా రిలీజ్ అయిన మూవీస్ లో చిన్న సినిమా మా ఊరి పొలిమేర ఒకటి… డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డిజిటల్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు…

కాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా పొలిమేర2(Polimera2 Movie) ని ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ చేస్తూ ఉండగా సినిమా మీద డీసెంట్ టు గుడ్ బజ్ అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు.  సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఆడియన్స్ లో డీసెంట్ క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సినిమా…

బిజినెస్ పరంగా కూడా ఓన్ గానే రిలీజ్ అవుతున్నా కూడా వాల్యూ బిజినెస్ రేంజ్ బాగానే ఉందని సమాచారం. సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల దాకా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా… ఓవరాల్ గా చిన్న సినిమానే అయినా కూడా మంచి బిజినెస్ నే సినిమా సొంతం చేసుకోగా…

ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మినిమం 4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన అవసరం ఉంటుంది ….మొదటి పార్ట్ చూసిన ఆడియన్స్ రెండో పార్ట్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ సినిమాకి కనుక…

పాజిటివ్ రెస్పాన్స్ వస్తే థియేటర్స్ కి వచ్చి బాగానే సినిమాను ఆదరించే అవకాశం ఎంతైనా ఉంటుంది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఈ బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here