బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు చిన్నవే అయినా కూడా కొంచం బజ్ ను క్రియేట్ చేసిన సినిమాలు అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన కీడా కోలా(Keedaa Cola) మరియు పొలిమేర2(Polimera2) సినిమాలు ఉన్నంతలో భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి.
కాగా రెండు సినిమాలు మొదటి రోజు ఉన్నంతలో మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోబోతున్నాయి ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే… కీడా కోలా సినిమా నైజాంలో బెటర్ ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉండగా పొలిమేర2 సినిమా ఆంధ్ర లో మంచి ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది…
కీడా కోలా సినిమా ఓవర్సీస్ లో తరుణ్ భాస్కర్ బ్రాండ్ వాల్యూతో ఆల్ రెడీ 200K డాలర్స్ మార్క్ ను ప్రీమియర్స్ తోనే సొంతం చేసుకుని దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 90 లక్షల దాకా ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగుండే అవకాశం ఉండటంతో తొలిరోజు 70-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…
వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు అటూ ఇటూగా 1.7 కోట్ల నుండి 1.9కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, అంతకన్నా ఎక్కువ వస్తే అది మాస్ రాంపేజ్ అని చెప్పొచ్చు. ఇక పొలిమేర2 సినిమా ప్రజెంట్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 90 లక్షల మార్క్ ని దాటగా…
ఆఫ్ లైన్ లో కూడా మంచి జోరుని చూపిస్తున్న ఈ సినిమా తొలిరోజు 80-90లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. నైజాంలో స్లో స్టార్ట్ తర్వాత సినిమా ఎక్స్ లెంట్ గా పుంజుకుంటుంది… దాంతో కలెక్షన్స్ లెక్క ఇంకా సాలిడ్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా ఎక్కువ ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక 2 సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.