బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన 2 చిన్న సినిమాలు కూడా ఓపెనింగ్స్ పరంగా కుమ్మేశాయి. మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో రోజులో అడుగు పెట్టిన 2 సినిమాలు కూడా మంచి హోల్డ్ నే చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం…
ఇక ఇందులో పొలిమేర2(Polimera2) మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మంచి డామినేషన్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా కొన్ని చోట్ల డ్రాప్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా సాలిడ్ గానే హోల్డ్ చేసింది. ఇక కీడా కోలా(Keedaa Cola) మూవీ ఓవర్సీస్ లో అలాగే నైజాంలో మంచి హోల్డ్ ని చూపించినా కూడా…
ఆంధ్రలో మాత్రం హోల్డ్ అంతంత మాత్రమే ఉంది… ఓవరాల్ గా ఇప్పుడు రెండో రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70-75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 1.2 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి… మొదటి రోజులా అంచనాలను మించితే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పొలిమేర2 సినిమా రెండో రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే1Cr-1.10Cr రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మొదటి రోజులా అంచనాలను మించిట్ ఈ లెక్క ఇంకా పెరగవచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా కోటి నుండి 1.1 కోట్ల మార్క్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద 2 సినిమాలు మొదటి రోజు రేంజ్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని అందు కుంటాయో లేక ఇవే విధంగా వసూళ్ళని సొంతం చేసుకుంటాయో చూడాలి ఇక….