బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి అనేది అన్ని ఇండస్ట్రీలలో కామన్ గా జరుగుతూనే ఉంటుంది… మన దగ్గర కూడా ఒకే వీక్ లో భారీగా పోటి అప్పుడప్పుడు ఉండగా ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే ఆల్ మోస్ట్ అన్ని ఇండస్ట్రీల సినిమాలు పోటి పడే ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ అని చెప్పాలి. అక్కడ సౌత్ నుండే కాదు ఆల్ మోస్ట్ ఇండియన్ మూవీస్ లో…
క్రేజ్ ఉన్న మూవీస్ అన్నీ రిలీజ్ అవుతాయి, ఆడియన్స్ ను ఆకట్టుకున్న సినిమాలు కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తాయి, దాంతో అక్కడ భాషా భేదం లేకుండా చాలా సినిమాలు కుమ్మేశాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడు లోకల్ మూవీస్ కన్నా కూడా ఇతర ఇండస్ట్రీల సినిమాలు బెటర్ గా పెర్ఫార్మ్ చేశాయి.
ఇక వచ్చే వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ సలార్, డంకి మరియు ఆక్వామాన్ సినిమాలు రిలీజ్ కానుండగా వారం గ్యాప్ కన్నడ టాప్ హీరోల్లో ఒకరైన దర్శన్ నటించిన కాతేర సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను రీసెంట్ గా పెట్టగా పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి…
మీరు ఎం భయపడటం లేదా అంటూ అడగగా హీరో మాట్లాడు ఆ సినిమాలకు మేం ఎందుకు భయపడతాం….వాళ్ళే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు భయపడాలి…. మాది పాన్ ఇండియా మూవీ కాదు పక్కా కన్నడ ఆడియన్స్ కోసం తీసిన సినిమా….ఇది మా ప్లేస్ అంటూ కామెంట్ చేశాడు…
దీనిపై కొందరు విమర్శలు చేస్తూ ఉన్నప్పటికీ ఎవరైనా ఓన్ ఇండస్ట్రీలో ఇతర ఇండస్ట్రీ హీరోల సినిమాలు పోటి పడుతున్నాయి అంటే డిఫెండ్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడటం కామన్ అనే చెప్పాలి. కానీ కర్ణాటకలో అన్ని సినిమాల రిజల్ట్ లు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.