Home న్యూస్ కుమ్ముతున్న నాగ చైతన్య దూత…2 వీక్స్ టాప్ తో మాస్ రచ్చ!

కుమ్ముతున్న నాగ చైతన్య దూత…2 వీక్స్ టాప్ తో మాస్ రచ్చ!

0

ఫస్ట్ టైం వెబ్ సిరీస్ లో OTT లోకి అడుగు పెట్టిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) లేటెస్ట్ గా దూత(Dhootha Web Series) తో వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టగా ఫస్ట్ అడుగులోనే ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు…. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సిరీస్ థ్రిల్లర్ గా తెరకెక్కి…

ఆడియన్స్ ను చాలా బాగా ఆకట్టుకుంది. స్టోరీ పాయింట్ నార్మల్ గానే ఉన్నా టేకింగ్ ఎక్స్ లెంట్ గా ఉండటం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా వరకు వర్కౌట్ అవ్వడం సిరీస్ కి కలిసి రాగా అమెజాన్ ప్రైమ్లో ఈ సిరీస్ కి ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి….

ఈ సిరీస్ రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 2 వారాలు అవుతూ ఉండగా ఆల్ మోస్ట్ 240 దేశాల్లో ఈ సిరీస్ ను ఆడియన్స్ ఎగబడి చూశారు. ఇక ఇండియా వరకే చూసుకున్నా 2 వారాలుగా అమెజాన్ ప్రైమ్ లో దూత సిరీస్ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో కొంచం సతమతం అవుతున్న నాగ చైతన్యకి దూత సిరీస్ తిరిగి మంచి పేరును నటుడిగా తెచ్చిపెట్టింది, అలాగే సిరీస్ కూడా అన్ని చోట్లా రీచ్ అవ్వడంతో ఆడియన్స్ ను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. ఇదంతా నాగ చైతన్య అప్ కమింగ్ మూవీ అయిన తండెల్ కి కలిసి వచ్చే అంశం అని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here