Home న్యూస్ ఇప్పుడు వచ్చినా అయిపోయేది….మొదటికే దెబ్బ పడిందిగా ఇప్పుడు!

ఇప్పుడు వచ్చినా అయిపోయేది….మొదటికే దెబ్బ పడిందిగా ఇప్పుడు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి అనేది కొన్ని సార్లు కొన్ని సినిమాలకు కలిసి వచ్చినా ఎక్కువ శాతం మాత్రం పోటి వలనే ఇబ్బందులే ఎదురు అయ్యాయి. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో వచ్చే సినిమాలకు పోటి ఉన్నా కూడా కలెక్షన్స్ వస్తాయి కానీ మిగిలిన టైంలో పోటిలో వచ్చిన సినిమాలు సక్సెస్ లు అందుకోలేదు…

టాలీవుడ్ లో డిసెంబర్ మొదటి వారంలో 2 స్ట్రైట్ మీడియం రేంజ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. పోటి పడాల్సిన అవసరం లేదు కానీ పోటిలో నాని(Nani) నటించిన హాయ్ నాన్న(Hi Nanna) నితిన్(Nithiin) నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man) సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ అవ్వగా…

వాటిలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హాయ్ నాన్న మంచి జోరుని చూపించింది… కానీ పోటిలో భారీ ఆశలు పెట్టుకున్న నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుని తిరిగి తేరుకోలేక పోయింది… అదే సినిమా లాస్ట్ వీక్ లో పోటిలో రిలీజ్ అవ్వకుండా…

ఈ వీక్ లో రిలీజ్ అయ్యి ఉంటే సోలో రిలీజ్ ను గ్రాండ్ గా భారీగా థియేటర్స్ లో సొంతం చేసుకుని ఉండేది, టాక్ సేం వచ్చేది కానీ కనీసం ఓపెనింగ్స్ అయినా బెటర్ గా ఉండేది. పోటి ఉండదు కాబట్టి మాస్ ఆడియన్స్ ను కొద్ది వరకు థియేటర్స్ కి రప్పించి ఉండేది సినిమా…

కానీ పోటి వలన 2 సినిమాల్లో ఏది బెటర్ అనే ప్రశ్నకి హాయ్ నాన్న ఆన్సర్ అవ్వడంతో ఈ సినిమాను జనాలు పట్టించుకోలేదు. ఈ వారం ఏమైనా పోటి ఉందా అంటే చాలా చిన్న సినిమాలు తప్పితే ఈ వీక్ మొత్తం ఖాళీగా ఉండగా పోటిలో రిలీజ్ అయిన నితిన్ కి మొదటికే దెబ్బ పడి మరో భారీ ఫ్లాఫ్ తన ఖాతాలో పడింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here