సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుని 1.4 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ స్టార్ట్ ను దక్కించుకుంది.
హైదరాబాదు లో సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సిటీలలో కుమ్మేసింది కానీ విలేజెస్ మాత్రం కొంచం బుకింగ్స్ అనుకున్న రేంజ్ లో లేవు, అదే టైంలో సీడెడ్ లో కూడా సినిమాకి ఓవరాల్ బుకింగ్స్ ఈ కాంబో క్రేజ్ తో పోల్చితే తక్కుగానే ఉండగా ఆంధ్రలో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది.
మొత్తం మీద టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా కూడా తొలిరోజు ప్రీ బుకింగ్స్ సాలిడ్ గా ఉండటం సినిమాకి హెల్ప్ అవ్వగా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా 32-34 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఓవరాల్ గా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం…
అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 43-45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూ గా ఉండొచ్చు, టాక్ కనుక యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను కనుక సొంతం చేసుకుంటే…
ఈ అంచనాలను కూడా సినిమా మించిపోయి ఊచకోత కోసేది కానీ మహేష్ త్రివిక్రమ్ ల కాంబో హైప్ కి తగ్గ టాక్ రాక పోవడంతో కొంచం ఇంపాక్ట్ అయితే ఉంది. ఇక ఫస్ట్ డే ఉన్నంతలో సూపర్ స్టార్ మాస్ రాంపేజ్ నే చూపించాడు. ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఇదే విధంగా ఉంటుందా లేక ఏమైనా గ్రోత్ కానీ మార్పులు కాని ఉంటాయో చూడాలి.