టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) సంక్రాంతికి రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా ఆ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని మహేష్ బాబు మాస్ రచ్చ చేయగా సినిమా పరుగును ఆల్ మోస్ట్…
పరుగును కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యింది, నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా కి డిజిటల్ రిలీజ్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది ఆసక్తి కరంగా మారింది…
సినిమా కి డిజిటల్ రిలీజ్ తర్వాత మిక్సుడ్ టాక్ కాకుండా ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ వినిపిస్తూ ఉండటం విశేషం, థియేటర్స్ లో మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినా కూడా ఇక్కడ మాత్రం రెస్పాన్స్ చాలా వరకు బెటర్ గా ఉంది, సినిమా స్టోరీ పాయింట్ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ కూడా…
మహేష్ అల్టిమేట్ ఎనర్జీ, తమన్ ఎక్స్ లెంట్ మ్యూజిక్, కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయిన కామెడీ పార్టు పార్టులుగా సినిమా బాగానే ఉందంటూ చెబుతున్నారు, ఎమోషనల్ సీన్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే ఆడియన్స్ నుండి థియేటర్స్ లో కూడా…
సినిమా కి బెటర్ టాక్ వచ్చేదన్నీ అభిప్రాయపడుతున్నారు… ఓవరాల్ గా థియేటర్స్ లో మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినా కూడా డిజిటల్ లో మాత్రం గుంటూరు కారం సినిమాకి మంచి రెస్పాన్స్ సొంతం అవుతుందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఎలాంటి వ్యూవర్ షిప్ ను ఈ సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.